Image
Name
Barre Kondababu
Posted
2020-03-26 05:24:00

Share:

కరోన వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 15 మందికి రాజమండ్రి నగర పాలక సంస్థ స్థాయి సంఘం చైర్మన్, వైసిపి నాయకులు బర్రె కొండబాబు బాసటగా నిలిచారు. ఈ నేపధ్యంలో కరోన వైరస్ పుణ్యమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్తో అన్ని వ్యాపారాల మాదిరిగానే ఈ చిరు వ్యాపారులపైన ప్రభావం పడింది.వీరికి తెలుగు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న బర్రె కొండబాబు వీరిపట్ల సానుభూతి తొ ఐదు వేల రూపాయల విలువచేసే బియ్యం, గోధుమ పిండి, గుడ్లు, ఇతర నిత్యావసర వస్తువులను బుధవారం ఉదయం వారికి అందసేశారు.ఈ సంధర్బంగా కొండబాబు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.


Comments

Comment on this Post
Login to comment