Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:59:32

Share:

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్న కొండబాబు రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమానికి రాజమండ్రి నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ చైర్మన్, వైకాపా నాయకుడు బర్రే కొండబాబు శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విధితమే. గత నాలుగు రోజుల క్రితం దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తన వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం 49వ డివిజన్ లోని సుబ్బారావు నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులోని ముఖ్య కూడళ్లలో ప్రజలను ఒక కూడలికి చేరి అమ్మవడి, ఇంగ్లీష్ మాద్యమం అమలు, పింఛన్లు, డ్వాక్రా రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు వంటి అంశాలపై ప్రజలకు వివరిస్తూ, రాబోయే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments
  1. Political Members Logo
    Gorantla Butchaiah Chowdary
    2020-03-14 06:48:10
    hlo

Comment on this Post
Login to comment