Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:46:28

Share:

రాజమహేంద్రవరం నగరంలోని సుబ్బారావు నగర్‌ ప్రాంతంలో క్వారీ యజమానుల నిర్లక్ష్యానికి నిలువుటద్ధంగా ఉన్న క్వారీ గోతుల్లో గల్లంతైన యువకుడి మృత దేహం శుక్రవారం లభ్యమైంది, గురువారం నాడు క్వారీ గోతుల్లో సుబ్బారావు నగర్‌కు చెందిన కొవ్వాటి ఆనంద్‌(25) ప్రమాదవశాత్తు పడి గల్లంతైయ్యాడు. గురువారం నాడు మృతదేహం కోసం స్థానికులు గాలింపు చేశారు. అయినా లభ్యం కాలేదు. అయితే బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్‌పి) జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు శుక్రవారం ఉదయం తన అనుచరులైన నామాని శ్రీను, బూర్తి లోవరాజు, బండి సురేష్‌, యాళ్ళ శివలతో కలిసి యువకుడు గల్లంతైన క్వారీలోకి దిగి గాలించగా ప్రమాదశాత్తు గల్లంతైన యువకుడు ఆనంద్‌ మృతదేహాన్ని వారు వెలికితీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Comments

Comment on this Post
Login to comment